మంచిర్యాల, నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యవర్గ సభ్యులు కొండు బానేష్
మాట్లాడుతూ గత మూడు రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు వడగళ్ళ వాన వలన రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని, అప్పులు చేసి వేసిన పంట అర్థాంతరంగా ప్రకృతి విలయానికి ఆవిరైపోతుంటే దిక్కు తోచని స్థితిలో గుండె పగిలేలా రోదిస్తున్న రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని,పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని, అదే విధంగా ఉద్యాన పంటకు ఎకరాకు 20, వేల రూపాయలు, మామిడికి ఎకరాకు 30 వేల రూపాయలు వరి కి ఏకరాకు 10, వేల రూపాయలు మొక్కజొన్నకు 15 వేల రూపాయలు జంతువులు మరణిస్తే ఒక జంతువుకి 30 వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు