రుణం తీర్చి…బారం దించి!

https://epaper.netidhatri.com/view/355/netidhathri-e-paper-22nd-aug-2024%09

-రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం!

-రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ విధానం.

-సాగు రంగ విస్తరణ కాంగ్రెస్‌ ఆచరణ.

-సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో అంకురార్పణ.

-భారీ నీటి పారుదల ప్రాజెక్టులతో సాగుకు భరోసా.

-కొత్త వంగడాల సృష్టితో ఆహార భద్రత.

-ఆనాడు దేశమంతా రుణం తీర్చిన ఘనత కాంగ్రెస్‌ దే!

-పదేళ్ల తర్వాత మళ్ళీ రుణం తీర్చింది కాంగ్రెస్రే!

-రుణమాఫీ మీద మాట తప్పిన బిఆర్‌ఎస్‌.

-పదేళ్లుగా రుణం తీర్చక మోసం చేసింది కెసిఆర్‌.

-పది నెలల్లో రుణ విముక్తి చేసి మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్‌ పార్టీ.

-కారు పార్టీ కల్లబొల్లి మాటలకు చెల్లు చీటి.

-రైతు రుణం తీరదని ఎద్దేవా చేసింది కారుపార్టీ.

-సాధ్యం కాదన్న వారి కళ్లు తెరిపించి రుణమాఫీ చేసింది కాంగ్రెస్‌ పార్టీ.

-చిత్తశుద్ధి అంటే ఇలా వుంటుంది.

-ఎగ్గొట్టిన వారికి కంటకింపుగా మారింది.

-రైతు రుణం తీరడంతో దిక్కుతోచక బిఆర్‌ఎస్‌ గాయి గాయి చేస్తోంది.

-అంకెల గారడి ముందు పెట్టి లెక్కల తొండి మొదలుపెట్టింది.

-రుణమాఫీ సంబరాలను చూసి కుళ్లుకుంటోంది.

-రైతు రుణం తీరడాన్ని చూసి సహించలేకపోతోంది.

-చరిత్ర హీనులుగా మిగిలిపోతామని బిఆర్‌ఎస్‌కు భయం పట్టుకున్నది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తీరిన రుణంతో ఆనంద పడుతున్నారు. పదేళ్ల కల నెరవేరి, నెత్తిమీద బరువు దిగిపోయింది. 2014 ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీచేస్తామని చెప్పి, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. 2018 ముందుస్తు ఎన్నికల్లో ఎలాగైనా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతుందని గ్రహించి, ఉన్న ఫలంగా రైతు బందు ప్రకటించింది. లక్ష రుణమాఫీ చేస్తామని రెండోసారి ప్రకటించడంతో మరోసారి బిఆర్‌ఎస్‌ను రైతులు నమ్మారు. కాని మరో ఐదేళ్లు గడిచినా కేసిఆర్‌ రుణమాఫీ చేస్తామని ప్రజలను మరోసారి మభ్యపెట్టారు. రైతులను నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో నాలుగు దఫాలుగా రుణమాఫీ అంటూ మరోసారి రైతుల చెవుల్లో గులాబీ పూలు పెట్టారు. అప్పుడే రైతులు నిర్ణయం తీసుకున్నారు. బిఆర్‌ఎస్‌కు బుద్ది చెబితే తప్ప రైతులు ప్రయోజనాలు నెరవేరవని గట్టిగా అనుకున్నారు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వస్తే రైతుల నెత్తిన వేలాడుతున్న రెండు లక్షల రుణమాఫ బరువు ఏక కాలంలో తీర్చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతులకు మాట ఇచ్చారు. ఇచ్చినట్లుగానే రైతులను రుణ విముక్తి చేశారు. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేయాలని బలంగా అనుకున్నారు. కాని పరిస్దితులు అనుకూలించలేదు. అదే సమయంలో రైతులకు రైతు భరోసా వేయాల్సివచ్చింది. దాంతో కొంత ఆలస్యమైంది. ఇంతలో ఇతర ఆరు గ్యారెంటీల అమలుకు కూడా శ్రీకారం చుట్టాల్సివచ్చింది. వాటిలో కొన్నింటిని పూర్తి చేశారు. ముఖ్యంగా మహిళలకు వాగ్ధానం చేసినట్లుగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. 90 రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అయితే ఇంతలో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో కూడా బిఆర్‌ఎస్‌ రాజకీయం చేయాలని చూసింది. రాష్ట్ర ప్రభుత్వంరుణమాఫీ చేయదంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారు. బిఆర్‌ఎస్‌ మాటలు నమ్మొద్దు. నేను మాట ఇచ్చానంటే ఎట్టిపరిస్ధితుల్లోనూ రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ప్రజలు విశ్వసించారు. కాకపోతే రుణమాఫీ చేయలేరన్న నమ్మకంతో బిఆర్‌ఎస్‌ పార్టీ అవాకులూ చెవాకులూ పేలుతూ వచ్చింది. ఆఖరుకు కేసిఆర్‌ కూడా రుణమాఫీ మీద మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. దాంతో పదేళ్లుగా రుణమాఫీ చేస్తామని మభ్యపెట్టిన కేసిఆర్‌ మాటలను పార్లమెంటు ఎన్నికల్లో ఎవరూ నమ్మలేదు. అందుకే బిఆర్‌ఎస్‌ను ప్రజలు సున్నా చుట్టేశారు.

సరిగ్గా పార్లమెంటు ఎన్నికల వేళ ఆగష్టు 15లోగా రెండు లక్షల రుణమాపీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శపధం చేశారు. చెప్పినట్లుగానే ఆగష్టు 15నాడు పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేశారు.

ఒకపెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు రుణమాఫీలో అక్కడక్కడా చిన్న చిన్న అవాంతరాలు ఎదురౌతుంటాయి. అలాంటి అవాంతరాలు ఎదురుకావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం. గత ప్రభుత్వం తెచ్చిన దరణి మూలంగా అనేక సమస్యలు ఎదురయ్యాయి. అనేక మంది రైతుల మధ్య ధరణి చిచ్చుపెట్టింది. కొత్త భూవిదానం పేరుతో తెచ్చిన ధరణి తప్పుల తడక మూలంగానే ఈ రుణమాఫీలో సమస్యలు ఎదురయ్యాయే గాని లేకుంటే పూర్తి స్ధాయిలో ఏక కాలంలో జరిగిపోయేవి. ప్రస్తుతం మూడు వాయిదాల్లో పూర్తి చేసిన రుణమంతా ఏక కాలంలోనే చేశారు. కాని బిఆర్‌ఎస్‌కు దానిపై అవగాహన లేక కాదు, రైతులను గందరగోళానికి గురి చేయాలని చూశారు. కాని ప్రజలు బిఆర్‌ఎస్‌ను అసలే నమ్మలేదు. ఒకసారి లక్షరూపాయల రుణమాపీ చేశారు. కాని లక్షను నాలుగు వాయిదాల్లో పూర్తి చేయలేదు. లక్ష లోపు రుణాలున్న రైతులను ముందుగా ఎంపిక చేసి వారందరికీ ఏక కాలంలో పూర్తి చేశారు. వారిని రుణవిముక్తి చేశారు. అంటే ఏక కాలంలో లక్ష రుణాలున్న రైతులందరికీ ఉపశమనం కలిగింది. తర్వాత లక్షన్నర రుణమున్న రైతులకు పూర్తి స్ధాయిలో రుణం మాఫీ అయ్యింది. అంతే కాని లక్షన్నర వున్న రైతులకు వాయిదాల పద్దతిలో రుణమాఫీ చేయలేదు. ఒకసారి లక్ష,తర్వాత యాభై వేలు రుణమాఫీ చేయలేదు. ఒకే సారి లక్ష రూపాయలు అప్పు వున్న రైతులకు ఎలా రుణమాఫీ చేశారో, లక్షన్నర బాకీ వున్న రైతులను కూడా ఏక కాలంలో రుణవిముక్తి చేశారు. ఆఖరుగా రెండు లక్షల రూపాయల రుణం వున్న రైతులను కూడా అదే తరహాలో ఒకే సారి రుణమాపీ చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి వాయిదాలకు తావులేకుండా పూర్తి చేశారు. సుమారు 31వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం కేటాయించారు. ఇలా ఏక కాలంలో ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వాలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమంలో కొన్ని లోపాలు వుండడం సహజం. అయినా ప్రభుత్వం వారిని వదిలేస్తామని చెప్పడం లేదు. వారికి పూర్తి చేస్తామమని చెబుతూనే వున్నారు. కాని బిఆర్‌ఎస్‌కు ఆత్రం మొదలైంది. కనీసం ఇక్కడైనా గెలుద్దామని బిఆర్‌ఎస్‌ తొందరపడిరది. కాని ఆ పార్టీ పప్పులుడికేలా లేవు. ఎన్నికల ముందు హమీ ఇచ్చిన విధంగానే పూర్తి స్ధాయి రుణమాఫీకి కట్టుబడి వున్నామంటూ ప్రభుత్వం చెబుతూనే వుంది. కాని బిఆర్‌ఎస్‌ నేతలకు ఆ మాటలకు చెవికెక్కడం లేదు. కాని రైతులకు అర్ధమైంది. ఎవరైనా రుణమాఫీ జరగని రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అందుకు కొంత సమయం గడవు కూడ ఇచ్చింది. ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. రెండు లక్షలకు పైగా వున్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే తెలంగాణ రైతుల తల మీద ఎలాంటి రుణ బారం వుండకూడదన్న సంకల్పంతో వుంది. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషిచేస్తోంది.

ఇలా రుణమాఫీ గతంలో 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏక కాలంలో దేశమంతా రుణమాఫీ చేసింది.

ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో వుంది. ఆ రోజుల్లో కూడా లక్ష రూపాయల వరకు వున్న రైతుల రుణమాఫీ జరిగిపోయింది. ఆ తర్వాత 2014లో కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చినా రైతుల సంక్షేమం ఏనాడు పట్టలేదు. రైతుల రుణమాఫీ గురించి మూడు ఎన్నికల్లోనూ పట్టించుకోలేదు. అసలు బిజేపికి రైతు రక్షణ మీద దృష్టి లేదు. రైతు సంరక్షణమీద చిత్తశుద్ది లేదు. పదేళ్లపాటు తెలంగాణలో పాలన చేసిన బిఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్కహమీని పూర్తి చేయలేదు. పెండిరగ్‌ సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేసింది. తన మార్కు పాలన కోసం తపించిన కేసిఆర్‌ ఎత్తిపోతలను ముందేసుకున్నాడు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు నీళ్లలోపోశారు. 2014 అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలిస్తామన్నారు. ఉద్యమ కాలంలో ఇంటికో ఉద్యోగం కూడా ఇస్తామని కేసిఆర్‌ మాయ మాటలుచెప్పారు. ఇందిరమ్మ ఇండ్లను అగ్గిపెట్టెలతో పోల్చి, రెండు పడకల ఇండ్లు ఇస్తామని ఒక్క ఇల్లు కూడా కట్టకుండా ప్రజలను నిండా ముంచారు. ఆఖరుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి చేతులెత్తేశారు. రేవంత్‌ రెడ్డి సర్కారు ఎట్టిపరిస్ధితుల్లోనూ రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. హరీష్‌రావు ఏకంగా సవాల్‌ కూడా చేశారు. ఇప్పుడు రుణమాఫీ పూర్తయినందును రాజీనామా చేయమని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తుండడంతో తప్పించుకొని, తన మాటలన వక్రీకరిస్తున్నారంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటున్నాడు. పైగా రుణమాఫీని తప్పు పడుతున్నారు. కృత్రిమ ఉద్యమాన్ని లేపి రైతులను ఎగదోసే కార్యక్రమం పెట్టుకున్నారు. పదేళ్ల పాటు ఇచ్చిన హమీని అమలు చేయని బిఆర్‌ఎస్‌కు రుణమాఫీ మీద ప్రశ్నించే హక్కులేదు. రైతు సంక్షేమం కాంక్షించే కాంగ్రెస్‌ను నిలదీసే అవకాశం బిఆర్‌ఎస్‌ అసలేలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!