ఈదురు గాలుల బీభ త్సవం.. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నల ఆవేదన
పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో ఈదురు గాలుల బీభత్సానికి కోతకు వచ్చే దశలో మొక్కజొన్న నేలకొరగడంతో రైతులకు కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి .

ఈదురు గాలులతో 100 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న రాత్రి వచ్చినటువంటి గాలి బీభత్సం వల్ల తండా గ్రామ రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని మండల వ్యవసాయ అధికారితో చెప్పగానే వెంటనే రైతుల పొలం కాడికి నేరుగా వచ్చి పరిశీలించి రిపోర్టు రాసుకొని రైతులకు తగిన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది రైతులు చాలా ఆనందంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరడమైనది.