
రైతు బజార్ ను వినియోగించుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం
కలెక్టర్ ఆదేశాలతో కూరగాయల వ్యాపారులకు షెడ్ల నిర్మాణం
కూరగాయలు, మాంసం, చేపల షాపులు తరలింపు
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను కూరగాయలు, మాంసం, చేపల విక్రయదారులు వినియోగించు కోవాలని బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతు బజార్ లోకి తరలించేందుకు అవసరమైన షెడ్ల నిర్మాణం చేస్తున్నామని, అదేవిధంగా ఈ రైతు బజార్ లోకి మటన్ షాపులు, మాంసం షాప్ లు, చేపల విక్రయం షాపులు సైతం తరలించాలని, ఎవరు కూడా రోడ్డు పక్కన అమ్మకూడదని అన్నారు.బతుకమ్మ ఘాట్ రైతు బజార్ ను జిల్లాలోని వినియోగదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వాడుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.