వేసవి కాలంలో ఆయిల్ ఫామ్ తోటలలో రైతులు జాగ్రత్తలు పాటించాలి

జిల్లా ఉద్యాన, పట్టు శాఖల అధికారి సంజీవరావు

భూపాలపల్లి నేటిదాత్రి

ఆయిల్ ఫామ్ తోటల్లో
అబ్లేషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఉద్యాన, పట్టు శాఖల అధికారి సంజీవరావు తెలిపారు. టేకుమట్ల రేగొండ మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలోని పాల్మాసి రాజేశ్వర్ రావు ఆయిల్ ఫామ్ తోటలో
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పూత తీసివేసే పద్ధతి (అబ్లేషన్) పై రైతులకు అవగాహన కారక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి సంజీవ రావు మాట్లాడుతూ
ఆయిల్ పామ్ మొక్క నాటిన 14 నుండి 18 నెలల వరకు మగ, ఆడ పూత వస్తుందని, సరియైన పద్ధతిలో పరిమాణంలో
నీటి తడులు, ఎరువులను అందించని ఎడల ఎక్కువగా మగపూలు, తక్కువగా ఆడ పూలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వచ్చిన పూతను మూడున్నర సంవతరాల వరకు అబ్లేషన్ పరికరాల ద్వారా తీసి మొక్క మొదట్లో మల్చింగ్ కోసం వేయాలన్నారు. మొక్క నాటిన 4వ సంవత్సరం నుండి దిగుబడి వస్తుందని, పూత తీయడానికి ఉపయోగించే శూలం లాంటి అబ్లేషన్ ఇనుప పరికరాలను సువెన్ అయిల్ నర్సరీ రేగొండ మండలం నుండి గాని ఈజి ఫామ్ టూల్స్ కంపెనీ, జాజుల కుంట, ద్వారకా తిరుమల మండలం, ఏలూరు, ఆంధ్ర ప్రదేశ్ 966676665 ద్వారా ఖరీదుపై పొందవచ్చుని తెలిపారు. వేసవిలో ఆయిల్ ఫామ్ మొక్కల పాదుల్లో జనుము, జీలుగ విత్తనాలను విత్తుకోవాలని, సరిపోయే నారు అనగా పెద్దచెట్లకు 300 నుండి 350 లీటర్ల నీరు ప్రతీ చెట్టుకు అందించాలని, అబ్లేషన్ ప్రతి ఒక్కరు చేయాలని, డ్రిప్ ద్వారా సిఫార్సు చేసిన ఎరువులను అందించాలని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, ఉద్యాన అధికారులు అధికారులు సునీల్ కుమార్, ఆయిల్ ఫామ్ కంపెనీ అధికారి అరవింద్, రైతులు రాజేశ్వర రావు, భూమా రావు, శేషగిరిరావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!