
Government orders.
రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి :
జహీరాబాద్ నేటి ధాత్రి:
రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి : మండల వ్యవసాయ అధికారి వెంకటేశం.
ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం రైతు భరోసా పథకం లో భాగంగా
ఝరాసంగం మండలంలోని రైతులందరూ వానకాలం 2025 సీజన్ కి సంబంధించిన తేదీ 05.06.2025. వరకు ఎవరికైతే నూతనంగా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అయిన రైతులు రైతు భరోసా పథకం కొరకు దరఖాస్తు చేసుకోవలని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు..
కావాల్సిన పత్రాలు:
1. రైతు భరోసా అప్లికేషన్ ఫారం
2. పట్టదార్ పాస్ పుస్తకం
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. బ్యాంకు అకౌంట్ జిరాక్స్
మీ యొక్క సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ నెల 20 వ తేదీ వరకు సమర్పించాలని తెల్పడం జరిగింది..