రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.!

Farmers

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులకు సూచించారు. ఈరోజు బుధవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంతో పాటు రవినగర్(జంగుపల్లి), గొల్లపల్లి గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అదేవిధంగా, గత ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇలాంటి అనేక హామీలను ఇచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఇంతకీ ఇరవై ఐదేళ్ల ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా? తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీకా? అని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ఎమ్మార్వో ఎంపీడీవో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!