
వాణిజ్య పంటల వైపురైతులు మొగ్గు చూపాలి.
#రాయితీ డ్రిప్, మల్చింగ్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
#జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ.
నల్లబెల్లి , నేటి ధాత్రి:
మండల వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏరువాక సాగుబడి అవగాహన సదస్సు కార్యక్రమం మండలంలోని రాంపూర్ రైతు వేదికలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏరువాక శాస్త్రవేత్త విజయభాస్కర్ , ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి పంటలో సూడోమోనాస్ ట్రైకోడెర్మా ఉపయోగం గురించి రైతులకి వివరించారు అలాగే పత్తి వరి మొక్కజొన్న మిరప పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎరువుల వాడకం పురుగుమందుల వాడకం నారుమడి సస్యరక్షణ గురించి వివరించారు మారిన కాలానికి అనుగుణంగా పంట మార్పిడి పద్ధతులు చేపట్టాలని పాత పద్ధతులకి అనుగుణంగా రైతులు మారాలని కూరగాయలు పండ్ల ఆయిల్ ఫామ్ పంటల వైపు మొగ్గుచూపి రైతులు ఆర్థికంగా ఎదగాలని కోరారు ఆయిల్ ఫామ్ పంట ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని ఎకరానికి లక్ష నుండి లక్ష యాభై వేల నికర ఆదాయం వస్తుందని చీడపీడల బాధలు ఉండవని ప్రభుత్వమే రేటు నిర్ణయిస్తుంది కాబట్టి డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద డ్రిప్ సౌకర్యం 90 శాతం వరకు అలాగే మల్చింగ్ రాయితీ 50 శాతం వరకు ఉంది. హెక్టార్ కి 20,000 సబ్సిడీ ఉంది కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలువురు రైతులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రజిత , ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి ,వ్యవసాయ విస్తరణ అధికారి మహేందర్ ,రైతులు పెరుమాండ్ల బాబు, పొనుగోటి దేవన్న ,పోలేపల్లి నరసింహారెడ్డి, బచ్చు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.