Smooth Paddy Procurement for Farmers
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి…
నేటి ధాత్రి -మహబూబాబాద్ :-
జిల్లాలో ధాన్యం కొనుగోలు నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.బుధవారం నెల్లికుదురు మండల కేంద్రం, రామన్నగూడెం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల రైతులకు ఎలాంటి పంట నష్టం జరగకుండా ముందస్తు సమాచారం అందిస్తూ రైతులను అప్రమత్తం చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వెంట వెంటనే తరలించాలని రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు త్వరగా అందేటట్లు నివేదికలు పంపాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో గన్ని సంచులు, టార్పాలిన్లు, మ్యాచర్స్ మిషన్ అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ధాన్యం తరలింపు విషయంలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు.ధాన్యం రవాణా విషయంలో వాహనాలను నిత్యం సిద్దంగా ఉంచుకోవాలని,హమాలీలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.
