Farmers Struggle for Urea in Warangal
ఒక బస్తా యూరియా కోసం రైతుల అగచాట్లురైతులకు సరిపడా యూరియా అందించాలి.
యూరియా బస్తా కోసం క్యూ లైన్లో కార్పొరేటర్
ప్రభుత్వం మేల్కొని రైతులను ఆదుకోవాలి.
సుంకరి మనిషా శివకుమార్ 16వ డివిజన్ కార్పొరేటర్
కాశిబుగ్గ నేటిధాత్రి.
గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలో ఒక్క యూరియా బస్తా కోసం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటువంటి దుస్థితిని నిరసిస్తూ స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ స్వయంగా క్యూ లైన్లో నిలబడి రైతుల కష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది.
⏩ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ
ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతుల సమస్యలను సీరియస్గా పరిగణలోకి తీసుకొని, రైతులకు సరిపడా యూరియా తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఎప్పుడూ లేని యూరియా కొరత సమస్య, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. ముందస్తుగా అవసరాలను అంచనా వేసి యూరియా నిల్వలు సిద్ధం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
వ్యవసాయ కాలానికి ముందే ప్రణాళికలు రూపొందించి, యూరియా సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం,నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి,
ముందస్తుగా యూరియా నిల్వలను ఏర్పాటు చేసి,
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా అందించాలని కార్పొరేటర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.ఇక ముందు గ్రామానికి రావాల్సిన యూరియా లోడ్ వంచనగిరి నుండి కాకుండా ధర్మారం లోనే పంచే ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
