
రైతులకు సరిపడా యూరియాను అందించాలి
పట్టా బుక్కు లేకుంటే ఆధార్ ద్వారా కూడా అందించాలి
-సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న
కరకగూడెం,,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి…
మండలంలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ తగిన స్థాయిలో యూరియా అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం మండలంలోని అశ్వాపురం గ్రామంలో పార్టీ మండల కమిటీ సమావేశం కొమరం మల్లక్క అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు ప్రభుత్వం వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే యూరియా మీద దృష్టి పెట్టినట్లయితే ఇంత పరిస్థితి ఉండేది కాదని రైతుల పక్షాన ఉండటంలో ప్రభుత్వం వైశాల్యం చెందుతుందని వారు విమర్శించారు ఒక్కో రైతు నాలుగైదు రోజుల తరబడి ఎదురు చూడటం ద్వారా నరకయాతనకు గురవుతున్నారని వారన్నారు తక్షణమే రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే యూరియా పంపిణీ విషయంలో పట్టాదార్ పాస్ పుస్తకలు లేని భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా ఆధార్ కార్డు నిబంధన అమలు చేయాలని మండలంలో చాలా మంది రైతులకు పట్టాలు లేవని గిరిజనులలో కూడా కొంతమందిలో భుమి పట్టాల సమస్య ఉందని పట్టాలు లేనివారికి ఆధార్ కార్డు ద్వారా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు యూరియాను ప్రభుత్వం తగిన స్థాయిలో అందించకుంటే రైతులను సమీకరించి ప్రభుత్వ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరం కాంతారావు మండల కమిటీ సభ్యులు చర్ప సత్యం, బిలపాటి శంకరయ్య, కనితి రాము, పద్దం బాబురావు తదితరులు పాల్గొన్నారు