Farmers repair road with their own help
స్వయం సహాయంతో రోడ్డు బాగుచేసుకున్న రైతులు
దుగ్గొండి,నేటిధాత్రి:
నిత్యం వ్యవసాయ పనుల కోసం వెళ్లే రోడ్డు అద్వానంగా మారింది.ఆ రోడ్డు ఎప్పుడు బాగుపడుతుందో ప్రయాణం సులభం అవుతుందని అధికారుల కోసం ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలిందని భావించిన ఆ రైతులు స్వయం సహాయంతో రోడ్డును బాగుచేసుకున్నారు.ఈ సంఘటన దుగ్గొండి చాపలబండ గ్రామంలో జరిగింది.స్థానిక రైతుకు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలంలోని చాపలబండ గ్రామం సమీపంలోని కార్ణాలకుంట నుండి వ్యవసాయ భూములకు వెళ్లే రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా అద్వానంగా మారింది.అధికారులు బాగు చేస్తారని అనుకున్నాము.ఎవరు
పట్టించుకోలేదు అని రైతులు అవేదన వ్యక్తం చేశారు.ఆ రోడ్డుగుంట వెళ్లే రైతులు ఎడెల్లి అశోక్ రెడ్డి, కురంగడ్ల రమేష్,తోకల శ్రీనివాసరెడ్డితో పాటు కొంతమంది రైతులు తన సొంత డబ్బులను పోగుచేసుకొని రోడ్డును బాగు చేసుకుంటున్నామని వారు తెలిపారు. గతంలో ఈ రోడ్డుపై ఉపాధి హామీ పథకంలో మట్టి రోడ్డు నిర్మాణం చేసినప్పటికి అది గుంతలమయంగా మారడంతో అటుగా వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.ఎవరో వచ్చి బాగు చేస్తారని ఎదురు చూడకుండా జెసిబి ట్రాక్టర్ ను వినియోగించి మొరంపోసి రోడ్డును బాగు చేసుకున్నామని రైతులు తెలిపారు.ఇప్పటికైనా రైతులు వినియోగించుకునే రోడ్లను బాగుచేయాలని సంబంధిత అధికారులను కోరారు.a
