
Urea Distribution to Farmers in Nizamapet
— యురియా కోసం క్యూ కట్టిన రైతులు
• అందుబాటులో యూరియా..
అధైర్యపడొద్దు..
తహసిల్దార్ శ్రీనివాస్..
నిజాంపేట: నేటి ధాత్రి
గత కొన్ని రోజులుగా యూరియా కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎవరు అధైర్యపడొద్దు అని అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందని ఎలాంటి అపోహలను నమ్మవద్దన్నారు. ఈనెల యూరియా ఆ నెలలోనే వస్తుందని సెప్టెంబర్ నెల యూరియా ఆగస్టులో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. శుక్రవారం నస్కల్ గ్రామానికి 20 మెట్రిక్ టన్నుల యూరియాను చల్మెడ, రాంపూర్, నస్కల్, నగరం గ్రామాలకు సంబంధించిన రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. యూరియాను అధిక మొత్తంలో చల్లకుండా 3 దాఫాలుగా చల్లడం వల్ల కర్ర ఎదుగుదల పెరుగుతుందన్నారు.