నష్టపరిహారాన్ని అందియాలని సింగరేణి సీఎం డి కి వినతి పత్రం ఇచ్చిన రైతులు
భూపాలపల్లి నేటిధాత్రి
హైదరాబాద్లోని సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయంలో సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ ని కలసిన భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పక్కిరిగడ్డ ఆకుదారువాడ రైతులు నష్టపరిహారం ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిన రైతులు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ OC-2 బ్లాస్టింగ్,దుమ్ము, దూలీలతో ఇండ్లు పగుళ్లు, అనేక మంది వ్యాధుల బారిన పడి చనిపోతున్నారని తెలిపినారు అలాగే నష్టపరిహారాన్ని వెంటనే మాకు అందియ్యాలి సిఎండిని కోరిన రైతులు
సింగరేణి సిఎండి బలరాం నాయక్ మాట్లాడుతూ మా డైరెక్టర్స్ జిఎం లతో ఇంటర్నల్ మీటింగ్ పెట్టి వివరాలు ప్రభావిత ప్రాంత ఆకుదారివాడ, పకీరు గడ్డ రైతుల నష్టపరిహారం గురించి చర్చిస్తానని హామీ ఇచ్చినారు..
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చైర్మన్ కి మా కష్టాలు, మేము పడుతున్న బాధలు,నష్టపరిహారం గురించి వివరించినాము.. వారు 10 రోజుల నష్టపరిహారం విధానాలు ప్రకటించకపోతే నిరవాతికంగా OC-2 బంద్. చేపడుతాం
ఈ కార్యక్రమంలో బుర్ర రమేష్, బుర్ర రాజయ్య,బుర్ర అనిల్, బుర్ర నాగరాజు,బుర్ర రాజు సెగ్గం శంకర్,కొల రాజమల్లు, భీమనపల్లి మహేందర్,బుర్ర మనోజ్, విస్లావత్ హతిరం, సీతనాయక్ యాకుబ్, ఆముదల రాంచందర్, బాలయ్య,సతీష్, అఫ్రోజ్, తదితరులు పాల్గొన్నారు..