మద్యం నిబంధనలు అతిక్రమించొద్దు-తుడుం దెబ్బ
రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల రాము
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన మద్యం టెండర్ల తో నూతనo గ మద్యం షాపులను డిసెంబర్ 01 2025 నుండి రాష్ట్ర వ్యాప్తంగ ప్రారంభించనుంది.
ఈ సందర్బంగా ఆదివాసీ సంఘాల నాయకుల సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ” రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెల రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం టెండర్లకు ఇచ్చినటువంటి గెజిట్ ను మద్యం లైసెన్స్ దారులు పాటిoచాలని ఉమ్మడి కొత్తగూడ మండలం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు కావున ఎక్సేంజ్ అధికారులు ఎప్పటికప్పుడు పరివేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం టెండర్ల కీ ఇచ్చిన గెజిట్ పాటించని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…కార్యక్రమం లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ” జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగ రావు, ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షులు కల్తీ నరేష్, “తుడుం దెబ్బ”కొత్తగూడ మండల అధ్యక్షులు పూనేం సందీప్,ప్రధాన కార్యదర్శి మల్లెల సారయ్య లు పాల్గొన్నారు.
