*రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి*
వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలంలోని పట్టధార్ పాస్ బుక్ కల్గిన రైతులు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయశాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మొగుళ్ళపల్లి మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కావున ఇది చేసుకోవడం వల్ల రైతు గుర్తింపు కార్డు అందిస్తారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. దీంతో రైతుల యొక్క డిజిటల్ డేటా బేస్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా రైతుల ఆధార్ నెంబర్, పట్టాదారు పాస్ బుక్ నంబర్ ఇతర పూర్తి వివరాలు పొందుపరిచి రైతులకు కేంద్రం ద్వారా వచ్చే పథకాలను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు లేనివారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించవని కేంద్ర ప్రభుత్వం వారు తెలిపారు. కావున ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులు మీ సమీప మీసేవ కేంద్రాల్లో లేదా మీ యొక్క క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని (AEO) సంప్రదించి వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయశాఖ ద్వారా కోరుతున్నాం.
