వానమ్మా…… రావమ్మా

ఆకాశం వైపు రైతన్నలు ఎదురుచూపు

పుడమితల్లికి దాహాన్ని తీర్చేందుకు రావమ్మా

శాయంపేట నేటి ధాత్రి:

వానమ్మా……రావమ్మా అంటూ తొలకరి వర్షాల కోసం మండల రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. వర్షాలు మురిపిస్తాయి అనుకుంటే అసలు జాడనే లేకపోవడంతో దిగాలు చెందుతున్నారు మృగశిర కార్తె పూర్తి కావడంతో రైతులు పత్తి విత్తనాలు వేశారు అక్కడక్కడ చిన్నపాటి చినుకులు పడతాయని తప్ప పెద్ద వర్షాలు జాడాలేదు అయినా నీటి వసతులు ఉన్న రైతులు విత్తనాలు వేసేశారు దీంతో మిగతా రైతులు ఆగమాగం అవుతూ వారు కూడా విత్తనాలు వేస్తున్నారు ఇప్పటికీ 70 నుంచి 80 శాతం మంది పత్తి విత్తనాలు పెట్టారు ఇక వరుణుడు కటాక్షం కోసం ఎదురుచూస్తున్నాడు ఈ రెండు మూడు రోజుల్లో వర్షాలు కురవని పక్షంలో పెట్టుబడులు నష్టం వాటిల్లై అవకాశముంది

అప్పటికి..,.. ఇప్పటికీ

గతేడాది తొలకరి వర్షాలు రైతులు మురిపించాయి పోయి నేడు ఇదే సమయంలో 90% మంది రైతులు పత్తి విత్తనాలు నాటారు సాధారణంగా జిల్లాలో రైతులు పత్తి విత్తన పంటను అధికంగా పండిస్తున్నారు అందులో పత్తి పంటను అధికంగా సాగు చేస్తున్నారు ఏడాది వర్షాలు రాక ఆలస్యం కావడంతో రైతులు పత్తి విత్తనాలు నాటడంలో నాటకీయ పరిస్థితి కనిపిస్తుంది నీటి సౌకర్యం ఉన్న కొంతమంది బడా రైతులు పత్తి విత్తనాలు వేశారు మిగతా రైతులు కూడా వారిని చూసి చిన్న సన్నకారు రైతులు కూడా విత్తనాలు వేశారు ఈ రెండు మూడు రోజుల్లో వర్షాలు పడితేనే ఆ విత్తనం మొలకెత్తి అవకాశం ఉంది లేదంటే భూమిలోనే విత్తు నాశనమై పరిస్థితి ఉంది తొలకరి ఆశాజనకంగా లేకపోవడంతో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. ధైర్యం చేసి తెచ్చిన విత్తనాలను నాటితే వర్షాలు లేక విత్తనాలకు నీరు ఉందని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ విత్తనాలు నాటాల్సి వస్తుంది.

సాధారణ వర్షపాతం

గత ఏడాది పోలిస్తే ఈసారి సాధారణ వర్షపాతంగా కనిపిస్తుంది మండలంలో అడపాదడప చినుకులు పడుతూ రైతన్నలకు ఆశ కల్పించి విత్తనాలు వేసేశారు సాధారణ వర్షపాతం 50 శాతం తక్కువ వర్షపాతం ఉంది. మండలంలో మొత్తం రైతన్నలు వర్ష ప్రభావం లేక భూమి తల్లడిల్లుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!