
Farmers Protest Over Urea Shortage
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు
పరకాల నేటిధాత్రి
యూరియా కొరతపై రైతులు బుధవారంరోజున పరకాల పట్టణలోని వ్యవసాయ మార్కెట్ ముందు ఆందోళనకు దిగారు.యూరియా అందక సాగు సీజన్ మధ్యలో తీవ్రంగా నష్టపోతున్నామంటూ పరకాల హనుమకొండ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.రైతుల ఆందోళన కారణంగా రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాకపోకలు దాదాపు గంటసేపు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.అనంతరం పరకాల ఎస్ఐ విఠల్ సిబ్బందితో కలిసి నిరసన చేపట్టిన దగ్గరికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.