
Urea Supply for Farmers
ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు
రైతు శ్రేయస్సును మరిచిన.. కాంగ్రెస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజును చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది.
రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్.
బాలానగర్ /నేటి ధాత్రి
బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు కలగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను గాలికి వదిలేసారన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్ల అవినీతి అవస్తమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. వచ్చే మూడేళ్ల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ కమల, లక్ష్మయ్య, గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.