రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి
మాజీ సర్పంచ్ నాగరాజు
మల్లాపూర్ మార్చి 17 నేటి ధాత్రి
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో రుణమాఫీ కానీ రైతులతో మొగిలిపేట మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులందరూ రాజకీయ పార్టీలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుందే తప్ప ఇప్పటివరకు 50 శాతం మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని అన్నారు. రుణమాఫీ కానీ రైతుల నుండి వివరాలు సేకరించారు. సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో రుణమాఫీ కానీ రైతులందరూ కలిసి కలెక్టర్ కు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని అన్నారు. రుణమాఫీ కానీ రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ దూలూరు సుధాకర్ రెడ్డి నాయకులు దండవేని వెంకటరెడ్డి మరియు రైతులు కొమిరి బాజాయ్య సామ శ్రీనివాస్ రెడ్డి ఎర్రంశెట్టి గంగారెడ్డి మద్దేల శ్రీనివాస్ రెండ్ల సాయన్న గాండ్ల బక్కన్న తదితరులు పాల్గొన్నారు.
రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి..
