
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని రాజుపల్లి గ్రామంలో హెచ్ఎం మరియు బిసిఐ ప్రాజెక్టులో భాగంగా ప్రజ్వల్ ఎఫ్ పిసీఎల్ ఆధ్వర్యంలో ఎల్జి 51,52 రైతులకి 56 నుంచి రైతులతో సమావేశం క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఈ ఫీల్డ్ డే లో హెచ్ఎం మరియు బీసీఐ ప్రాజెక్టులో భాగంగా రైతులకు ప్రాజెక్ట్ గురుంచి సంస్థ ప్రతినిధి షేక్ గౌస్ తెలియజేయడం జరిగింది.రైతులు భూసార అభివృద్ధి నీటి సంరక్షణ వాతావరణ పరిరక్షణ సహజీవాసాలను సంరక్షించే విధంగా కృషి చేయాలని దీంతోపాటు సామాజిక అంశాలను ముఖ్యంగా బాల కార్మిక నిర్మూలన కార్యక్ర మాలు అమలు చేస్తూ మంచి పత్తిని ఉత్పత్తి చేసే విధంగా కృషి చేయాలని రైతులు సాంప్రదాయ జీవ భౌతిక యాంత్రిక రసాయన పద్ధతిలో పత్తి పంటను పండించి ప్రపంచ మార్కెట్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మంచి దిగుబడి సాధించాలని రైతులకు వివరించడం జరిగింది అలాగే మన బీసీఐ పత్తికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. తద్వారా రాబోయే కాలంలో మంచి పత్తిని ఉత్పత్తి చేసే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు రాజు మల్సాని లక్ష్మ ణరావు తిరుపతిరావు ,రమేష్ ,21 డైరెక్టర్ గడ్డం రమేష్, మనసాని మాధవరావు ,క్షేత్ర సిబ్బంది దొడ్డిపాక రవిచందర్ ,పోతు సునీల్, తరాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.