నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి :
ఆయిల్ పామ్ సాగుతో ఆర్థికంగా రైతులు ఎంతగానో బలపడతారని జిల్ల రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష నారాయణ, ఉద్యానవన శాఖ అధికారి సంగీత లక్ష్మి అన్నారు.
దేశంలో అత్యధికంగా ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని వారు పేర్కొన్నారు.దుగ్గొండి మండలంలోని పోనకల్ గ్రామంలో గల రైతు బుసరి బాబురావు ఆయిల్ ఫాం క్షేత్రంలో జిల్లా జనసేన ఆద్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. నూతనంగా వేసే రైతులు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.ఈనేపథ్యంలో రైతులతో కలిసి అధికారులు ఆయిల్ పామ్ తోటను పరిశీలించి రైతు అవలంబిస్తున్న విధానాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొత్తగా ఆయిల్ సాగు కు ప్రభుత్వం ప్రోత్సాహకాలను వివరించారు.ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఫైల్డ్ ఆఫీసర్ అనిల్ కుమార్, దేవరాజ్,తదితరులు పాల్గొన్నారు.