నష్టపరిహారం చెల్లించాలని OC2 రోడ్డుపై రైతుల ధర్నా

భూపాలపల్లి నేటి ధాత్రి

సింగరేణి ఓసి 2 గని కోసం భూములు కోల్పోయిన తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని ఫకీర్ గడ్డ, ఆకుదారి వాడా గ్రామాల రైతులు ఓసి2 – 1ఇంక్లైన్ రోడ్డుపై బైఠాయించారు. దాంతో రోడ్డుపై బొగ్గు లారీలు నిలిచిపోయినాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల క్రితం సింగరేణి యాజమాన్యం 0C 2 కోసం తమ భూములు స్వాధీనం చేసుకున్నదని అప్పటినుంచి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని, ఓసి గని నుంచి వచ్చే దుమ్ము ధూళి ద్వారా ఎంతోమంది తమ కుటుంబ సభ్యులు రోగాల పాలవుతూ మరణిస్తున్నారని,ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి తమను సురక్షిత ప్రాంతానికి తరలించి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఓసి 2 గనిని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. కాగా విషయం తెలుసుకున్న సింగరేణి జిఎం బళ్లారి శ్రీనివాస్ మీడియా సమక్షంలో ఫోన్ ద్వారా రైతులతో మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు మార్చి 25 తేదీ లోపు సింగరేణి చైర్మన్ తో కల్పించి మాట్లాడిస్తానని హామీ ఇవ్వగా.. ఒకవేళ 25 తారీకు లోపు తమకు న్యాయం జరగకుంటే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలిపి రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు బుర్ర రమేష్ గౌడ్, బుర్ర రాజయ్య, సెగ్గం శంకర్, ఎస్ కే యాకూబ్, కోల రాయమల్లు, బుర్ర మనోజ్, విస్లావత్ హాతిరాం నాయక్, ఇస్లావత్ సమ్మయ్య, భీమనపల్లి మహేందర్, బుర్ర అనిల్, సెగ్గం ఎల్లారం, బుక్క రవి, దాస్యం రవికుమార్, కంచర్ల బాలయ్య, రాజేందర్ నాయక్, విస్లావత్ సమ్మయ్య, విస్లావత్ బాలు నాయక్, గుర్రం కిష్టయ్య, కెక్కర్ల మధున, మేడిపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *