— యూరియా కై..
తప్పని తిప్పలు..
* సొసైటీ వద్ద కిక్కిరిసిన రైతులు..
నిజాంపేట: నేటి ధాత్రి
గత కొన్ని రోజుల నుండి రైతులకు యూరియా అందక అవస్థలు పడుతున్న విషయం విధితమే.. నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో సోమవారం సుమారు 300 బస్తాలతో లోడ్ సొసైటీలోకి రావడంతో రైతులు ఉదయం నుండి ఆధార్ కార్డు, పట్ట పాస్బుక్ తో రైతులు క్యూ కట్టారు. రైతులు అధిక సంఖ్యలో మోహరించడంతో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా కూడా వస్తుందో రాదోనని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తగినంత యూరియా అందుబాటులోకి తీసుకురావాలని వేడుకుంటున్నారు.