బంధుత్వ దినోత్సవం సందర్భంగా రక్త దాన శిబిరం
వనపర్తి నేటిదాత్రి .
అన్ని దానాల కన్న రక్తదానం చేయడం గొప్పదని
బ్రహ్మ కుమారిస్ శోభ నాగమణి అన్నారుఆదివారం బ్రహ్మ కుమారి రాజ యోగ సేవా కేంద్రంవనపర్తి శాఖ ఆధ్వర్యంలో విశ్వ బంధుత్వ దినోత్సవం రాజ యోగిని ప్రకాశమని దాది గారి 18వ స్మృతి దినాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా రక్త దాన శిబిరం నిర్వహించగా వనపర్తి కేంద్రం లో రక్త దానం చేశారుఈ సందర్బంగావారు మాట్లాడుతూ అధర్మం ఎక్కువ అయినప్పుడు ఒక మానవ రూపంలో భగవంతుడు ప్రవేశిస్తాడని అన్నారు ప్రస్తుతం ప్రజలు భయబ్రాంతులతో జీవిస్తున్నారని ప్రకృతి ఆపదలు అదికమయ్యయి కుటుంబబందాలలో స్వార్థం పెరిగిపోయిందినిస్పృహ భయం ఆందోళనలు రోగాలు అదికమయ్యయి ఇది కలియుగ అంతానికి నిదర్శనమని, సరిగ్గా ఇటువంటి సమయంలోనే భగవంతుడు అవతరిస్తారని రాజ యోగ బ్రమ్మకుమారిస్ నాగమణి శోభ అక్కయ్యలు తెలిపారు ఆయా కాలాల్లో క్రీస్తు, బుద్ధుడు గురునానక్, ప్రవక్త వంటి వారు దర్మ ప్రబోధకులుగా అవతరించారు అన్నారు అనంతరం రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ తో పాటు ప్రత్యేక కానుకలను అందజేశారు.ఈ శిబిరంలో సీనియర్ జర్నలిస్ట్ గంధం భక్త రాజు రాజ యోగ కేంద్రం భక్తులు సతీష్, రాజు ఆర్యవైశ్య నేత ఏలిశెట్ల వెంకటేష్ కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు