
Farmers Struggle for Urea in Ramayampet
యూరియా కోసం రైతుల తిప్పలు
వర్షాన్ని లెక్కచేయని క్యూలైన్లు..
రామయంపేట సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలం కాట్రియాల, ధర్మారం గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు అత్యవసరమైన యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీ ఎదుట బారులు తీరారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా, తడుస్తూనే ఒక బస్తా యూరియా కోసం ఎనిమిది గంటలపాటు క్యూలైన్లలో నిలబడ్డారు.
“తడిసినా పర్వాలేదు… మా పంటలకు యూరియా లేకపోతే ఎండిపోతాయి” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా లైన్లలో నిలబడటం గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో
రైతులు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు.ఇక మాకు హామీలు వద్దు వెంటనే యూరియా సరఫరా చేయాలి. పంటల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.