
District Secretary Marapallimallesh
రైతులకు సకాలంలో రుణాల అందించాలి….
యూనియన్ బ్యాంక్ మేనేజర్ వైఖరి మార్చుకోవాలి…..
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లిమల్లేష్
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల యూనియన్ బ్యాంకు లో నిరుపేద రైతులకు .. క్రాప్ లోన్ రెన్యువల్ చేసుకుని కొత్త రుణాలను ఇవ్వాలి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లిమల్లేష్. అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కానీ క్రాప్ లోన్ ఉన్న రైతులందరూ గత సంవత్సరం తీసుకున్న అప్పు వడ్డీ కలిపి కడితేనే మళ్లీ రుణాలు ఇస్తానంటూ అంటున్న మేనేజర్ వైఖరి మార్చుకొని రైతులు పెట్టుబడి సీజన్ లో ఎంతో ఉపయోగపడే క్రాప్ లోన్ వడ్డీ కట్టించుకుని కొంత పెంచి రుణం ఇవ్వాలి కానీ అసలు వడ్డీ కడితేనే రుణం ఇస్తామనడం బాధాకరమైన విషయం రైతులు ప్రైవేటు వ్యక్తులు ఆచరించి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడితే పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అనేక మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు నిరుపేద రైతులను ఆలోచించి వడ్డీ కట్టిన వారందరికీ క్రాప్ లోన్ రెన్యువల్ చేసి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కొత్త రుణాలు ఎకరానికి 50,000 చొప్పున ఇవ్వాలని రైతులను ప్రైవేటు అప్పుల బాధ నుండి కాపాడాలని అన్నారు వడ్డీ అసలు కడితే రుణం ఇస్తామని బ్యాంక్ మేనేజర్ అనడం వల్ల మధ్య దళారి వ్యవస్థను రైతులు అనుసరించి వారి ద్వారా రెన్యువల్ చేసుకునే పరిస్థితి వచ్చినది మధ్య దళారులు రైతుల దగ్గర కట్టిన డబ్బులకు అధిక వడ్డీ వసూలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు దీనికి ప్రధానంగా బ్యాంకు మేనేజర్ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన వారు అవుతున్నారు తక్షణమే వడ్డీ కట్టిన రైతులందరికీ రెన్యువల్ చేసి సకాలంలో రుణాలు అందించాలని కొత్త రుణాలు ఇవ్వాలని లేకపోతే రైతులతో ఆందోళన చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం పార్టీ మండల కార్యదర్శి ఆకునూరి జగన్ పాల్గొన్నారు