
"Farmers Protest Over Urea Shortage in Singereni"
సింగరేణి మండల కేంద్రములో యూరియా మందుకట్టల కోరకు రైతుల ఆందోళన.
కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం లోని వివిధ గ్రామాల నుండి రైతులు యూరియా మందుకట్టల కోసం తెల్ల వారు జామున 3.గంటల నుండి మండల కేంద్రము లోని సహకార పరపతి సంఘం.సోసైటి వద్దకు రైతులు వచ్చి యూరియా మందుకట్టల కోసం లైన్ లో ఉంటు పడిగాపులు కాస్తున్నారు.శనివారం తెల్లవారుజామున వచ్చిన రైతులు లైన్ లో ఉంటు సింగరేణి మండల అగ్రికల్చర్ అధికారికి రైతులు ఫోన్లో యూరియా మందుకట్టల కోసం అడుగగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని చెప్పాగా అనేక రోజులుగా మందుకట్టల కోసం పడిగాపులు కాస్తున్నా రైతులు ఆగ్రహించి కారేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని సెంటర్ లో మండలం లోని వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన రైతులు యూరియా మందుకట్టల కోసం రోడ్లు పైన బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.రైతులు చేస్తున్న ఆందోళన వల్ల ఇల్లందు నుండి ఖమ్మం మాదారం నుండి ఖమ్మం వెళ్ళే ఆర్టిసి బస్సులు కాలేజీ బస్సులతో పాటు వాహనాల్లోవెళ్ళె ప్రయాణికులు వేళ్ళ కుండా రైతులు ఆందోళన చెస్తుండగ కారేపల్లి ఎస్సై బైరు గోపి పోలీసు సిబ్బందితో రైతుల వద్దకు వచ్చి రైతులవద్ద నుండి విషయం అడిగి తేలుసుకోగ రైతులు యూరియా మందుకట్టల కోసం ప్రతిరోజూ పడిగాపులు కాస్తున్నారని రైతులకు యూరియా మందుకట్టలు సకాలంలో అందిచకపోగ మండల రైతులు అడుగగా మందుకట్టలు లేవని అసలు మీమ్ములను ఎవరు రమ్మన్నారని కారేపల్లి ఎస్సై కి రైతులు తెలుపగా ఎస్సై బైరు గోపి వెంటనే స్పందించి ఎఓ బట్టు అశోక్ తో మాట్లాడి రోడ్లు పైన బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన రైతులను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.రైతులు సోసైటి కార్యాలయానికి వచ్చిన సింగరేణి మండల అగ్రికల్చర్ అధికారికి బట్టు అశోక్ ని రైతులు యూరియా మందుకట్టల కోసం నిలదియ్యగ ఎఓ మందుకట్టలను రెపుయిస్తామని తెలుపడంతో ఎస్సై బైరు గోపి రైతులకు నచ్చజెప్పి పంపించారు.