లక్షమాఫీ నిజమే!నా?

https://epaper.netidhatri.com/view/332/netidhathri-e-paper-28th-july-2024%09

`ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవముందా!

`పదేళ్లలో జరగనిది ఇప్పుడు జరిగింది!

`గతంలో నాలుగు దఫాలలో మిత్తికే సగం పోయింది!

`రేవంత్‌ సర్కార్‌ లక్ష ఏక కాలం మాఫీ నిజంగా బేష్‌.

`రుణమాఫీలో ఒక అడుగు పడడం శుభపరిణామమం.

`నిజానికి లక్షలోపు రుణమున్న రైతులే ఎక్కువ.

`మెజారిటీ రైతులకు రుణ భారం తీరింది.

`అక్కడక్కడా సమస్యలు సహజం.

`ఆగష్టు 15 నాటికి పూర్తి మాఫీపై రైతులకు పెరిగిన నమ్మకం.

`ఒక్క దెబ్బతో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ మళ్లీ పెరిగింది.

`కానే కాదు అన్నటు వంటి వాళ్ల నోరు మూయించినట్లైంది.

`మిగతా రుణమాఫీ పెద్ద కష్టం కాదు.

`రైతులకు కొత్త రుణాలకు ఇబ్బంది లేదు.

`ఏక కాలంలో రుణమాఫీ ఒక సంచలనం.

`గతంలో ఏ రాష్ట్రంలో జరగని రైతు సంక్షేమం.

`ముఖ్యమంత్రి రేవంత్‌ కు ప్రజల నుంచి ధన్యవాదాలు.

`పార్టీ పెద్దల నుంచి ప్రశంసలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒక అపూర్వ ఘట్టం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది. రైతు రుణమాఫీకి ఒక అడుగు ముందుకు పడిరది. ఏక కాలంలో పదానికి అర్ధం చెప్పారు. ముందుగా ఒక లక్ష రుణం వున్న రైతులను విముక్తి చేశారు. ఆగష్టు 15 వరకు రెండు లక్షల వరకు రుణం వున్న రైతులను విముక్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతే కాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.72వేల కోట్లు కేటాయించారు. ఇది దేశ చరిత్రలోనే ఒక పెద్ద కేటాయింపులు. పైగా ఏక కాలంలో రైతు రుణమాఫీ అన్నది కూడా చారిక్రత నిర్ణయం. ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ఏడాదిలోగా పూర్తి చేయడం అన్నది కూడా గొప్ప విషయమే. ఎన్నికలు ముగిసిన వెంటనే అన్న మాట చెప్పినా, ప్రభుత్వానికి వెసులుబాటు ఎంతైనా అవసరం. అందుకే కాస్త ఆలస్యమైంది. అయినా రైతు రుణం తీరింది. వ్యవసాయం అంటేనే ప్రకృతితో జూదం అన్నారు పెద్దలు. ఆరుగాలం శ్రమించే రైతుకు సాగుకాలంలో ఏ ఒక్క రోజు ప్రకృతి సహకరించపోయినా పంట చేతికి రాదు. రైతు కష్టం కన్నీటి పాలు. అడుగడుగునా గుదిబండలు..ఎల్ల వేళలాల సుడిగుండాలు అన్నట్లు సాగుబాటు మొదలై రోజు నుంచి పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేని వృత్తి సాగు. అలాంటి వ్యవసాయాన్ని నమ్ముకొని నాలుగు గింజలు పండిరచుకొని తినే రైతుకు ప్రతి క్షణం ఒక యుద్దమే. ప్రతి నిమిషం ఒక నిర్వేదమే. ప్రతి అడుగు ఖర్చుతో సావాసమే. దుక్కి దున్నిన నాటి నుంచి సాగు ఖరీదు లెక్కేసుకుంటూ సొమ్ము ఖర్చు పెట్టుకోవాల్సిందే. లాభం మాట దేవుడెరుగు పెట్టుబడి కూడా చేతికి వస్తుందా? లేదా? అన్న దిగులుతోనే ఆరు నెలలు గడుపుతాడు. అందుకు అడుగడుగునా అప్పు చేస్తాడు. పంట ఎంత చేతికొస్తుందో కూడ తెలియకుండా భూమి నమ్ముకొని కలలు గంటుంటాడు. ఈ ఏడైనా పంట రాకపోతుందా? అన్న ఆశతో బతుకుతుంటాడు. ఈసారి పంటతోనైనా బాధలు తీరుతాయా? ఆశలు రెక్కలు కట్టుకుంటాడు. అందుకే నిరంతరం ఓడుతున్నా, భూమిని నమ్ముకొని గెలుస్తానని వ్యవసాయం చేస్తుంటాడు. పడి లేచిన కెరటం లాగా ప్రకృతిని కన్నెర్రను కూడా కన్నీళ్లలో దిగమింగుకుంటాడు.

పంట చేతికి వచ్చినా, రాకపోయినా ప్రకృతిని నమ్ముకొని సాగు చేస్తుంటాడు.

ఆ నమ్మకంతోనే జీవితాంతం బతుకుతుంటాడు. తన భవిష్యత్తును మట్టిలోనే చూసుకుంటాడు. ఈ ప్రయాణంలో అప్పులు చేస్తాడు. పస్తులుంటాడు. పరుల ముందు పలుచనౌతుంటాడు. అయినా ఎవరినీ లెక్క చేయడు. భూమిని నమ్ముకోవడం వదిలేయడు. అప్పులెన్నైనా చేస్తాడు. నేల తల్లి సాక్షిగా తల తాకట్టు పెడుతుంటాడు. ఇదీ రైతు కథ. వ్యధ. కాని ఆ రైతుకు రుణం అంటే తల మీద పెద్ద భారం. ఆ భారం పంటల ద్వారా వస్తుందని పదే పదే విశ్వసిస్తుంటాడు. పంటలు పండిరచి అప్పులు తీర్చాలనుకుంటాడు. కాని సమయం సహకరించకపోయినా, ప్రకృతి సహాకారం అందకపోయినా, చెమట చుక్కలతో సాగు చేసైనా సరే నేను రైతును అని కష్టం చేస్తాడు. తన కష్టాలన్నీ దిగమింగుకొని పొలం చూసుకొని మురిసిపోతుంటాడు. అలాంటి రైతుకు మెడ మీద వెళాడుతున్న రుణ భారం దిగిపోతే ఎంతో సంతోషం. అదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసింది. రైతు తల మీద బండెడు బారమైన రుణాని మాఫీ చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని విముక్తి చేశారు. రైతు కళ్లలో ఆనందం చూస్తున్నారు. దశాబ్ధ కాలంగా ఎదురుచూసిన తరుణం వచ్చి, బ్యాంకు రుణం తీరిన రైతు కళ్లలో ఆనందం అంతా ఇంతా కాదు. ఇంత కాలం రుణమెలా తీరేది అని కలత నిద్రలో కాలం గడిపిన రైతు,కంటి నిండా కునుకు తీసే రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెచ్చారు. రుణమాఫీ చేసి వారి సంతోషం, ఆనందం రెండూ ఒకేసారి ఇచ్చారు. గత శాసన సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ రైతులకు ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రజలుకు హమీ ఇచ్చారు. ఆ హమీ ఇప్పుడు నిలబెట్టుకున్నారు. రైతులను రుణవిముక్తి చేశారు.

అయితే ఇంత పెద్ద కార్యక్రమంలో కొన్ని లోపాలుండొచ్చు.

సమస్యలు ఎదురుకావొచ్చు. ఏదైనా బ్యాంకు తిరకాసుల మూలంగా అక్కడక్కడ కొందరికి రుణమాఫీ జరగలేదన్న వార్తలు కూడ వస్తున్నాయి. అవి కూడా పూర్తయ్యే రోజు తప్పకుండా వస్తుంది. రైతు రుణమాపీ జరిగిన రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇంత కంటే గొప్ప తరుణం మరొకటి లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి గెలిపించిన రైతులను రుణ విముక్తి చేయడంలో ఎంత సంతోషాన్నిచ్చిందన్నారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా తర్వలో పూర్తి చేస్తామన్న భరోసాని ప్రజలకు కల్పించారు. రైతు రుణమాఫీ జరిగింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏక కాలంలో రుణమాఫీ రూ. 2లక్షల వరకు పూర్తి చేస్తామని రైతులకు మాట ఇచ్చారు. అయితే ఏక కాలంలో ప్రభుత్వం రుణమాఫీ మాట తప్పిందన్న అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఇంకా రైతులను తప్పుదోవ పట్టించే కుట్రలు ఇంకా చేస్తూనే వున్నారు. నిజానికి పదేళ్లలో కేసిఆర్‌కు సాద్యం కాని రుణమాఫీ ఎలా రేవంత్‌రెడ్డికి ఎలా సాధ్యమైందన్న దానిని గురించి లోతైన విశ్లేషణలు చేయకుంగా, రుణమాఫీ మీద బిఆర్‌ఎస్‌ కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తోంది. దాంతో బిఆర్‌ఎస్‌ మరింత ప్రజల్లో పలుచనౌతోంది. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అది కూడా రెండు లక్షల వరకు చేస్తామని కూడా హమీ ఇచ్చింది. అది అక్షరాల రుజువైంది. కాని ప్రతిపక్షాలకు అర్దం కాని విషయమేమిటంటే ఏక కాలంలో రుణమాఫీ అంటే ఏమిటో తెలియకుండాపోయింది. తెలంగాణలో వున్న రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణం వుండదు. పది వేల నుంచి మొదలు, రెండు లక్షల వరకు వుంటుంది. అందులో మొదటి దఫాలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరిగింది. అంటే లక్ష లోపు బ్యాంకు రుణం వున్న రైతులందరకీ ఏక కాలంలో రుణ మాఫీ జరిగింది. ఈ మాత్రం అర్దం కాని వాళ్లు రాజకీయాలు చేయడం వల్లనే ప్రజలు నష్టపోతున్నారు. ఏక కాలంలో రుణమాఫీ అంటే మొత్తం రైతులందరికీ అన్నదే కాదు, రుణం వున్న రైతులందరీకీ అన్నది అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు లక్ష రూపాయల అప్పు వున్న రైతులకు విడతల వారిగా రుణ మాఫీ జరిగితే అది ఏక కాలంలో జరిగినట్లు కాదు. కాని ఒకేసారి లక్ష రుణమాఫీ జరిగిన తర్వాత అది ఏక కాలంలో అన్నది కూడా తెలియకపోవడం బిఆర్‌ఎస్‌ పార్టీ అవగాహన లేమికి నిదర్శనమని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

లక్ష రూపాయల రుణం వున్నవారికి పూర్తి స్ధాయిలో రుణమాఫీ జరిగిందన్నది బీఆర్‌ఎస్‌ నాయకులు తెలుసుకోవాల్సిన విషయం.

అది పక్కన పెట్టి లేని పోని రాజకీయాలు చేద్దామనుకుంటే రైతుల చేత మరోసారి బిఆర్‌ఎస్‌ పార్టీ కర్రు కాల్చి వాత పెట్టించుకునే పరిస్ధితే ఎదురౌతుంది. మొత్తం మీద రైతు విముక్తి పంద్రాగష్టులోపు పూర్తి కానున్నది. శాసన సభ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఎంతో ప్రధానమైనందే ఈ రుణమాఫీ. డిసెంబర్‌ 3న అధికారంలోకి వస్తాం..రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు రేవంత్‌ రెడ్డి 84 సభల్లో చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలు రావడం వల్ల రుణమాఫీ సాధ్యం కాలేదు. దాంతో పార్లమెంటు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగష్టు 15 నాటికి ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ప్రజలకు మరోసారి హమీ ఇచ్చారు. అప్పటి నుంచి బిఆర్‌ఎస్‌ రుణమాఫీ కాదన్నట్లు చెబుతూ వచ్చారు. కాని బిఆర్‌ఎస్‌ పదేళ్లలో చేయలేని పనిని ఖచ్చితంగా చేసి తీరాలని సిఎం. రేవంత్‌రెడ్డి బలంగాకోరుకున్నారు. అన్నట్లుగానే ఆగష్టు 15 వరకు పూర్తి చేస్తామన్న మాటకు కట్టుబడి తొలి విడత రుణమాఫికీ శ్రీకారం చుట్టారు. తెలంగాణలో సుమారు 40లక్షల మందికి పైగా లక్షలోపు రుణాలున్న రైతు కుటుంబాలున్నాయి. వారందరకీ ఏక కాలంలో రుణమాఫీ చేయడం అన్నది గొప్ప కార్యక్రమం. రైతులను రుణ విముక్తి చేయడం జరిగింది. దీన్ని కూడా రాజకీయం చేయాలని బిఆర్‌ఎస్‌ చూసింది. కాని కాంగ్రెస్‌ పార్టీ నుంచి వస్తున్న జడి వానను బిఆర్‌ఎస్‌ తట్టుకోలేకపోయింది. పదేళ్ల పాటు అదికారంలో వుండి రైతు రుణ మాఫీ చేయలేని వాళ్లకు మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్‌ ఎదురుదాడి ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!