# కౌలు రైతులను పట్టించుకోని రేవంత్ ప్రభుత్వం.
# ప్రభుత్వం భరోసా కల్పించకనే రైతుల ఆత్మహత్యలు.
# అప్పుల బాధతోనే గిరిజన మహిళ ఆత్మహత్య మృతి.
# 7 ఎకరాల్లో పెట్టుబడి పెట్టీ.. భారీ వర్షాలకు తీవ్ర నష్టం..
# గిరిజన మహిళ కుటుంబానికి 25 లక్షల ఎక్షీ గ్రేషియా ఇవ్వాలి.
# నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్.
# వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం..
నర్సంపేట,నేటిధాత్రి :
అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల ఆత్మహత్యకు రోజురోజుకు పెరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంతానికి గార్లగడ్డాతండాకు చెందిన పాల్తీయ భద్రమ్మ అనే గిరిజన మహిళ కౌలు రైతు 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని అప్పుల భాదతో ఆత్మహత్య చేసుకోగా జిల్లాలో సంచలనంగా మారింది.దీంతో వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాదం చోటుచేసుకున్నది.ఆ గిరిజన మహిళ కౌలు రైతు భద్రమ్మ అదే గ్రామానికి చెందిన నూనె సదయ్య అనే రైతు వద్ద ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నది.మహిళా రైతు ఆత్మహత్య పట్ల బీఆర్ఎస్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.ఆ గిరిజన మహిళ కౌలు రైతు ఆత్మహత్య పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా భరోసా కల్పిస్తుందన్న నమ్మకంతో 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని అప్పులు తెచ్చి సాగుచేసిందన్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు తను వేసిన పంటలు నష్టపోయిందని దీంతో పెట్టినపెట్టుబడికి మొత్తం అప్పుగా తీసుకురావడంతో అప్పులు పెరగడం వలన మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని మరణించిందని అవేదన వ్యక్తం చేశారు.భారీ వర్షాల వల్ల పంట నష్టంపైన అధికారులు సర్వేలు చేసి రైతులకు మనోధైర్యాన్ని కల్పించి ఉంటే గిరిజన మహిళా రైతు ఆత్మహత్య ఆగిఉండేదని ప్రస్తుతం జరుగుతున్న రైతుల అత్మహత్యలు దురదృష్టకరం అని పేర్కొన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.
ఇప్పటివరకు కౌలు రైతులను గుర్తించలేకపోవడంతో పాటు వారికి ఎలాంటి భరోసాని కూడా కల్పించలేదాని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు చేసే ప్రకటనలు కౌలు రైతులపైన పరస్పరంగా విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.రాష్ట్రంలో రైతులు,కౌలు రైతులు చేసుకునే ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.నర్సంపేట మండలంలోని గార్లగడ్డా తండా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ రైతు పాల్తీయ భద్రమ్మ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి పంటనష్టాన్ని అంచనావేసి వారికి పరిహారం కల్పిస్తామని భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.మేనిఫెస్టోలో పెట్టినా అనేక అంశాలను ఈ ప్రభుత్వం నెరవేర్చడంలేదని అలాగే రైతులకు భరోసా కల్పించడంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.రైతులెవరు అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు.బీఆర్ఎస్ పార్టీ,మాజీ సిఎం కెసిఆర్ రైతులకు ఎప్పుడు అండగా ఉంటూ రైతులకు మద్దతుగా పోరాడుతామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు.