రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
భద్రాచలం నేటి ధాత్రి
ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి
వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు చర్యలు నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన
తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు హామీలు నెరవేర్చాలని వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లకార్డులు చేతపట్టి స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతాంగ వ్యతిరేక చర్యలు చేపడుతున్న కాంగ్రెస్ ద్వంద వైఖరి నశించాలని.. ఎన్నికల్లో సీట్ల కోసం రైతులకు రైతు కూలీలకు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని . బిఆర్ఎస్ ప్రభుత్వం 8000 ఇస్తున్నది. మేము 15000 ఇస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతు భరోసా రైతులకు ఎగబట్టి పెట్టుబడి సాయం మరిచి రైతులతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ విధానo నశించాలని అన్నారు..
ఆరు గ్యారెంటీలతో మహిళలకు మాయ మాటలతో గద్దెనీకిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు విస్మరించిందని ఎటువంటి సరదాలు లేకుండా రైతులకు రుణమాఫీ రైతులకు రైతు భరోసా రైతులకు ఎటువంటి సేవలు లేకుండా రైతు బీమా 24 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించాలని లేకపోతే రైతాంగ పోరాటం మరింత బలపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోరాటంలో కొట్టుకపోవడం ఖాయమని అన్నారు
ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పార్టీ పడిసిరి శ్రీనివాస్. సీనియర్ నాయకులు బిరబోయిన వెంకట నరసమ్మ. అయినాల రామకృష్ణ .కోలా రాజు .గుంజా ఏడుకొండలు. తూటిక ప్రకాష్. కాపుల సూరిబాబు. బత్తుల నరసింహులు. పసుపులేటి రమేష్ .గోసుల శ్రీనివాస్. రాజుదేవర నాగరాజు.బడిశా నాగరాజు. కావూరి సీతామహాలక్ష్మి పూజల లక్ష్మి .నరసమ్మ .తేల్లం రాణి. సుశీలమ్మ. సలోమి .సలీమా .
ప్రియాంక తదితరులు ఉన్నారు