Farmer ID Card Mandatory for All Farmers
ప్రతి రైతుకు రైతు గుర్తింపు కార్డ్ తప్పనిసరి….!
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో హద్నూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికరి రైతు గుర్తింపు కార్డ్ ల నమోదు ప్రక్రియ నిర్వహించారు.భూమి కల్గిన ప్రతి రైతు, రైతు గుర్తింపు కార్డ్ కు తప్పనిసరి దరఖాస్తు చేసుకోవాలని న్యాల్ కల్ మండల హద్నూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి తెలిపారు.ఈ సందరంగా వవసాయ విస్తరణ అధికారి పోల్కం సాయిలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రైతు లభించే ప్రతి ఆర్థిక సహాయం గానీ, సబ్సిడి లు గానీ, ఎరువులు గానీ మరియు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన పథకం ద్వారా పొందే ఆర్థిక ప్రోత్సాహకం గానీ అందాలన్న తాము ఒక రైతుగా, రైతు గుర్తింపు కార్డ్ కు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ఇంకా నమోదు చేసుకొని వారు తమకు సంప్రదించగలరు అని సూచించారు.
