మహాదేవపూర్ -నేటి ధాత్రి:
మండల కేంద్రానికి చెందిన సుంకరి లక్ష్మీనారాయణ 48 మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వివరాలు కి వెళ్తే మండల కేంద్రంలోని తెలుగు వాడకు చెందిన సుంకరి లక్ష్మీనారాయణ, వ్యవసాయంపై ఆధారపడి ఉన్న కుటుంబం గత సంవత్సరం పంట దిగుబడి రాకపోవడం పెద్ద మొత్తంలో అప్పుల బారిన పడిన లక్ష్మీనారాయణ, అనారోగ్యానికి కూడా గురికావడం జరిగింది, అలాగే అప్పులు వ్యవసాయ పంట కొనసాగింపు పై కుటుంబంలో పలుమార్లు గొడవలు జరగడం తో లక్ష్మీనారాయణ మనోవేదనకు గురికావడం, అప్పులు తీర్చే పరిస్థితి లేకపోవడం కుటుంబం కిష్ట పరిస్థితిలో తనకు ప్రోత్సహించకపోవడం లాంటి ఆవేదనకు గురై, శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్న క్రమంలో లక్ష్మీనారాయణ మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.