
electric shock
విద్యుత్ షాక్ తో రైతు సజీవదహనం
గుండాల,నేటిధాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పొలం వద్దకు బైక్‌పై వెళ్తున్న రైతు విద్యుత్ తీగలు తగిలి సజీవదహనమయ్యాడు. వన్నెలబైలు గ్రామానికి చెందిన రాజు (35) తన పొలానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు అతడికి తగిలాయి. విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బైక్‌తో సహా రాజు అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు.