సింగరేణి ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు
మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి ఉన్నత పాఠశాలలో 2024 /25 సంవత్సరానికి 10వ తరగతి పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలుకుతూ ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే పార్టీ వేడుకలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా నిర్వహించారు.
మందమర్రి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఆవరణలో సీనియర్ విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు బుధవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పాఠశాల కరస్పాండెంట్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్ కు విద్యార్థులు పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు హాల్ టికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకు గౌరవాన్ని అందిస్తూ చదువు పూర్తి చేసుకుని పాఠశాలను వదిలి వెళుతున్న వారి కోసం ఏర్పాట్లు అభినందనీయమని కొనియాడారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల శిక్షణలో విద్యను అభ్యసించిన అందరూ పదవ తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశాభవం వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడులకు లోను కాకుండా చదువు పైనే దృష్టి పెట్టి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. సింగరేణి పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలతో పాటు ఉచితంగా పుస్తకాలు యూనిఫాం పంపిణీ చేస్తూ మధ్యాహ్న భోజనం కూడా కల్పిస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.