వ్యాసరచన పోటీల్లో మండల స్థాయి విజేతలు వీరే
కొత్తగూడ నేటిధాత్రి
జనవరి 25 న జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకొని గురువారం మండల కేంద్రం లోని మోడ ల్ స్పోర్ట్స్ స్కూల్ లో మండల విద్యాశాఖ అధికారి గుమ్మడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల స్థాయి వ్యాస రచన, ఉపన్యాసం, డ్రాయింగ్, సోలో సాంగ్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్బంగా మండల విద్యాశాఖ అధికారి గుమ్మడి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఓటు విలువను తెలుసుకోవాలని, తమ ఇంట్లో మరియు గ్రామంలో ఉన్న వారందరూ బాధ్యతగా ఓటు వేసేలా ప్రోత్సహించాలని” కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని, ముఖ్యంగా యువత ఓటు హక్కు ను బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉపన్యాసం లో వి.శివుడు ఎం ఎస్ ఎస్ స్పోర్ట్స్ స్కూల్ ఫస్ట్ ప్రైజ్,.సి యచ్ చరణ్య-కెజీబీవీ కొత్తగూడ,వ్యాసరచన:గుగులోత్ నందిని- టీ డబ్ల్యూ (ఏ ఎచ్ ఎస్(జి)కొత్తగూడ,డి. మధుప్రియ-టీ డబ్ల్యూ ఆర్ జేసీ (జి)కొత్తగూడ,డ్రాయింగ్:
సి యచ్. శ్రావ్య-టీ డబ్ల్యూ ఏ హెచ్ ఎస్(జి)కొత్తగూ,జి. సుమశ్రీ-( ఎంపీ యూపీఏస్) కొత్తగూడ,సోలోసాంగ్:రామటెంకి. సంజన-(ఎంపీ యూపీఏస్) వీరు మండల స్థాయి విజేతలు గా నిలిచారని తెలిపారు.ఈ కార్యక్రమం లో మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ డి.సారయ్య, వన ప్రేమి డాక్టర్ పులుసం సాంబయ్య, సోషల్ ఫోరమ్ తీగల రమేష్ గౌడ, రేగా పాపయ్య,డాక్టర్ వాసం వీరాస్వామి, బి మంగీలాల్, నామాల మోహన్, సిర్పీలు యల్ వెంకన్న, మంకిడి ఉపేందర్,జి లలిత, వి సంధ్య, యం స్వప్న, యస్ అరుణ, యం మల్లేశ్వరి, యం రజిత, ఎంపెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
