సైన్స్ ఫెర్లో అద్భుత ప్రదర్శనలు.
… చూపరులను ఆకట్టుకున్న విద్యార్థుల ప్రతిభ.
రామయంపేట నేటి ధాత్రి
మెదక్ విద్యార్థులు కేవలం చదివే కాకుండా అన్ని రంగాల్లో ముందుంటారని ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిరూపించారు. రామాయంపేట పట్టణంలోని వివేకానంద విద్యాలయంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ లో పలు ప్రదర్శనలు విద్యార్థుల మేజర్సుకు అద్దం పడుతున్నాయి. విద్యార్థుల ప్రదర్శించిన పలు ప్రదర్శనలు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడే విధంగా ఉన్నాయి.

ప్రకృతి సేద్యం విధానం.
.. ప్రదర్శన చూపించిన విద్యార్థిని వైష్ణవి.
స్థానిక వివేకానంద విద్యాలయంలో మూడవ తరగతి చదువుతున్న సిహెచ్ వైష్ణవి ప్రకృతి సేద్యం పట్ల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రకృతి సేద్యానికి పేడ ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రదర్శనలలో చూపడం జరిగింది. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యకరమైన పంటలు, కూరగాయలు పండించుకునే విధానాన్ని విద్యార్థిని చక్కగా ప్రదర్శించడం జరిగింది.
వేస్టేజ్ తో కరెంట్ తయారీ విధానం.
.. విద్యార్థి నీరాజాక్ష్.
వేస్టేజ్ పదార్థాలను ఉపయోగించి కరెంటు తయారుచేసుకునే విధానాన్ని విద్యార్థి నీరాజాక్ష్ ప్రదర్శనలు అద్భుతంగా చూపించడం జరిగింది. వ్యర్థాలను ఉపయోగించి కరెంట్ తయారీతోపాటు, గ్యాస్ తయారీ విధానాన్ని ప్రదర్శనలో చూపించడం జరిగింది. వ్యర్థాలను ఇలా ఉపయోగిస్తే భవిష్యత్తులో వేస్టేజ్ కూడా వృధాగా పోదని ఈ ప్రదర్శన ద్వారా తెలుస్తోంది. విద్యార్థి ప్రదర్శన చాలామందిని ఆకర్షించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నీరాజ్యాక్ష్ ను అభినందించారు.