
Division Assistant Secretary Rajamouli
మున్సిపల్ అధికారుల చర్యలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు
ఎంసిపిఐ(యు)డివిజన్ సహాయ కార్యదర్శి రాజమౌళి డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో రోడ్లకు ఇరువైపులా చిరు వ్యాపారులు తమ జీవనాధారం కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణ సముదాయాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నర్సంపేట మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నారని ఎంసిపిఐ(యు)నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి రాజమౌళి అవేదన వ్యక్తం చేశారు.ఆయా నియానాలను తొలగించడం అన్యాయమని వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ నర్సంపేటలో చాలా ఏళ్లుగా నిరుపేదలు తమ చిరు వ్యాపారాలను చేసుకుంటున్నారని ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వారి దుకాణ సముదాయాలు తొలగించి స్వాధీనం చేసుకున్న సామాగ్రిని మున్సిపల్ అధికారులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ దుకాణాల తొలగింపులు అధికార పార్టీ నాయకులకు కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు.మున్సిపల్ అధికారులు స్పందించి వారికి తక్షణ ప్రత్యామ్నయం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.