Hanumanth Rao Slams BRS Over Fake Social Media Campaigns
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు..
దోచుకోవడమే కేసీఆర్ పని
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యం
డబ్బులతో నాయకులను కొనేస్తున్నారు.
తీవ్ర విమర్శలు చేసిన
హనుమంతరావు
నిజాంపేట: నేటి ధాత్రి
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పై బురద చల్లడమే బిఆర్ఎస్ పనిగా పెట్టుకుందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. నిజాంపేట మండలం కల్వకుంటలో కాంగ్రెస్ పార్టీ లో చేరికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించాడని ద్వజమెత్తారు. రాష్ట్రం ఏలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజలకు ఎలాంటి పథకాలు అందలేవని పేర్కొన్నారు. 9 వేల కోట్ల రుణమాఫీ రైతులకు చేయకుండా మాయమాటలతో కాలమెల్ల దీశారన్నారు. రాష్ట్రంలో ఉన్న సగం రైస్ మిల్లు బిఆర్ఎస్ నాయకులవేనన్నారు. గత పది ఏళ్లుగా ప్రజలను దోచుకోవడమే బిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమనట్టు ఆ విధంగా పనిచేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒకే గ్రామం చింతమడక గ్రామంలో ఒక్కో ఇంటికి 10 లక్షలు ఇవ్వడం హీనమైన చర్య అని విమర్శించారు. పోలీసు వ్యవస్థలో కూడా నేటికీ కొంతమంది బిఆర్ఎస్ కు సపోర్ట్ గా నిరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఏనాడు గత సీఎం మెదక్ నియోజకవర్గానికి వచ్చిన దాఖలలు లేవని కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి మెదక్ నియోజకవర్గానికి వచ్చి ఏడుపాయల, చర్చి అభివృద్ధికి నిధులు విడుదల చేశారన్నారు.
చనిపోయిన శివాల కూడా రాజకీయాలు చేసే దుస్థితి బిఆర్ఎస్ పార్టీది అని ఆయన పేర్కొన్నారు. గొర్రెల పంపిణీలో 1200 కోట్లు పట్టించుకోని తప్పించుకున్నారన్నారు. చాలా మంది యాదవ సభ్యులకు గొర్రెలు నేటికి అందలేవన్నారు. 10 ఏళ్లలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేయలేని దుస్థితి బిఆర్ఎస్ పార్టీదన్నారు. హరీష్ రావు మెదక్ నియోజకవర్గం పై నేటికీ పిత్తనం చూపించడం సిగ్గుచేటు అన్నారు. కొన్ని బిఆర్ఎస్ తొత్తులుగా మారిన కొన్ని టీవీ చానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, చౌదరి సుప్రభాత రావు, మండల అధ్యక్షుడు వెంకట గౌడ్, చింతల స్వామి, రంగా రాజా కిషన్,నషిరోడిన్,మహేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
