పల్లెల్లో పడకేసిన……!
ప్రత్యేకాధికారుల పాలన.
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం: గ్రామాలలో సర్పంచుల పదవీ కాలం ముగి సిన తర్వాత పంచాయతీల పాలనను నిర్వహించేందుకు ప్రభుత్వం నియమిం చిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో పర్యటించకపోవడం, పాలన ఆస్తవ్యస్థంగా మారడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల, డివిజన్ స్థాయి గెజిటెడ్ ఉద్యోగులకు మూడు కంటే ఎక్కువ పంచాయతీ బాధ్యతలు అప్పగిం చగా, వారి ఇప్పటి పనిభారం కారణంగా గ్రామాల పరిస్థితులను పరిశీలించేం దుకు ఉదాసీనత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రత్యేకాధికారులు గ్రామా లకు రాకపోవడం గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం లేకుండాపోతోంది.

ఝరసంగం మండల కేందంలోని 8వ వార్డులో మురుగు కాలువలో చెత్త చెదారం పేరుకుపోవడంతో నీరు ప్రవహించడం లేదు. ఒక కాల నిలో నెలల తరబడి మురుగు నీరు నిలిచి చిన్న కుంటా తలపిస్తోంది. దీనివల్ల దుర్వాసన వ్యాపిస్తోంది మరియు పందులు స్వైరంగా తిరుగుతున్నాయి. ఝద సంగం, కుప్పానగర్ గ్రామాల్లో చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా అడ వుల్లో పారచడం జరుగుతోంది, దీనివల్ల ముగజీవులు ప్లాస్టిక్ కవర్లను తింటు న్నాయి. కాలువల్లో మురుగు పేరుకుపోవడం, కొన్ని చోట్ల మురుగునీరు రోడ్లపై ప్రవహించడం, దోమలు విజృంభించడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్యులు పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనలో సర్పంచులు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల నిర్లక్ష్యం గ్రామాల పరిస్థితిని దిగజార్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం కోసం చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని లేదా ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో డిఎల్పిఓ అమృతను సంప్రదించగా, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.