పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి చూపు పరీక్ష,కళ్ల జోళ్లు పంపిణీ
నడికూడ,నేటిధాత్రి:
వరికోల్ అభివృద్ధి ప్రదాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మండలంలోని వరికోల్ గ్రామంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికోసం పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 28 తారీకు ఆదివారం రోజున
మెగా మెడికల్ క్యాంప్ ఉచిత కంటి చికిత్స పరీక్షలు, కళ్ళజోల్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు గ్రామమంతా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు పోచంపల్లి ఫౌండేషన్ సభ్యులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొని కంటిచూపు పరీక్షలు విజయవంతం చేసుకోవాల్సిందిగా ర్యాలీ నిర్వహించారు.
