పర్మిషన్స్ లేకుండా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల తక్షణమే మూసివేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులవాసులు చేస్తున్న విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని బుక్స్ యూనిఫామ్స్ వేళల్లో అమ్ముతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై అదేవిధంగా పర్మిషన్స్ లేకుండా నడుస్తున్న ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థలను తక్షణమే మూసివేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అదేవిధంగా మండలాల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థుల దగ్గర్నుంచి వేలకు వేలకు ఫీజులు వసూలు చేయడం బుక్స్ మరియు యూనిఫార్మ్స్ పేరుతో వేలకు వెలు ఫీజులు వసూలు చేయడం అదేవిధంగా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థుల దగ్గర్నుంచి వెహికల్ ఫీజు అని ఎగ్జామ్ ఫీజులని అదేవిధంగా యూనిఫార్మ్స్ మరియు బుక్స్ తదితర ఫీజులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం తాగినట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అకాడమీ క్లియర్ స్టార్ట్ కాకముందే ముందస్తు అడ్మిషన్ల పేరుతో కరపత్రాలు వేసుకొని ఇంటింటా ప్రచారం చేసుకుంటూ మీరు మా స్కూల్లో చేరండి మా స్కూల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం విద్యార్థులకు అన్ని ఫ్రీ అని చెప్పి పేద మధ్య తరగతి విద్యార్థులను మోసం చేస్తూ విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు మీరు మా స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి ఫీజులు ఉండవు అని చెప్పి అబద్ధపు మాటలు చెపుతుంది ఒక్కసారి విద్యార్థి అడ్మిషన్ అయిన తర్వాత వీళ్లకు వీడు సంవత్సరానికి ఫీజులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా స్టడీ అయిపోయి పై తర్వతులకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి స్టడీ సర్టిఫికెట్స్ కానీ టీసీ కాను తీసుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థుల దగ్గర్నుంచి అధికంగా ఫీజులు వసూలు వసూలు చేస్తున్నారు ఇలాంటి ఫీజులు లేవని చెప్పి ముందే జాయిన్ చేసుకున్నారు కదా అని విద్యార్థి తల్లిదండ్రులు అడిగితే స్టడీ సర్టిఫికెట్స్ మరియు టీసీకి మీరు తప్పకుండా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి విద్యార్థుల దగ్గర్నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా విద్యాసంస్థల్లో బస్సులు నడుపుతున్నటువంటి విద్యాసంస్థలు ఫిట్నెస్ లేకపోవడం వల్ల భవిష్యత్తులో బస్సు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బస్సులు నడుపుతున్నటువంటి డ్రైవర్లకు సంబంధించి లైసెన్స్ కూడా లేవు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు కేవలం పేద మధ్యతరగతి నుంచి వచ్చి చదువుకున్న విద్యార్థుల దగ్గర్నుంచి డబ్బులు ఎక్కువ మొత్తంలో లాగుతున్నారు అదేవిధంగా తల్లిదండ్రులు అడుగుతే ఇది ప్రైవేట్ స్కూల్ ఇక్కడ నేను చెప్పినట్టే ఉండాలి అని తల్లిదండ్రులను బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు నడుపుతున్నటువంటి యజమాన్యాలు వారే సొంతంగా బుక్ సెంటర్లు ఓపెన్ చేసి ఇలాంటి పర్మిషన్స్ లేకుండా బుక్స్ సెంటర్లు ఓపెన్ చేసి బుక్స్ మరియు యూనిఫామ్స్ కు వేలలో ఫీజులు అందుకుంటున్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు అకాడమీ క్లియర్ స్టార్ట్ అయిన కానుంచి తన యొక్క చదువు పూర్తయ్య వరకు లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఒక LKG చదివే విద్యార్థి దగ్గర్నుంచి సంవత్సరానికి 20 నుంచి 30 వేలు వసలు చేస్తున్నారు ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలన్నిటికీ తగు పరిష్కారం చూడాలని వారు కోరారు ఇకనైనా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం తీసుకువచ్చి అందులో చదువుకునే విద్యార్థులకు ఆసరాగా నిలబడాలని ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కోరుకుంటుంది లేనియెడల ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలని మూసివేసే విధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది