
మళ్ళీ మోడీ ప్రభుత్వం రావాలి అంటున్నా యువత
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని దుబ్బ పల్లి, వెంకట్రావుపల్లి, నర్వ గ్రామాలలో ఆదివారం రోజున బిజెపి నాయకులు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇంటింటి ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా దేశ ప్రజలందరికీ ఎంతో లబ్ధి చేకూరిందని, భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిచిందని, బిజెపి పార్టీ పేద ప్రజల పార్టీ అని, అందరూ కలిసికట్టుగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ని ఆశీర్వదించి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువకులు
పాల్గొన్నారు.
వేలాలలో ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన బిజెపి నాయకులు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథరావు మరియు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, దుర్గం అశోక్ ఆదేశాల మేరకు జైపూర్ మండల బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఆదివారం రోజున జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలో నాగులకుంట చెరువు వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ముచ్చటించి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కూలీలకు కూల్ డ్రింక్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం దేశాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని, ఎన్నో వందల సంవత్సరాలుగా భారతీయులంతా ఎదురుచూస్తున్న రామ మందిరాన్ని అయోధ్యలో నిర్మించిన మహా నేత మన నరేంద్రమోడీ అని,మూడోసారి కూడా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనదేశం ఇంకా అత్యున్నత స్థానంలోకి చేరుకుంటుందని, జైశ్రీరామ్ జై మోడీ అంటూ నినదించారు. అందరూ తప్పకుండా కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి గోమాస శ్రీనివాస్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేలాల గ్రామ బిజెపి నాయకులు ,కార్యకర్తలు, వేముల తిరుపతి గౌడ్, ప్యాగ లవ కుమార్, ప్యాగ మొగిలి, దుర్గం విజయ్, చకిలం ప్రవీణ్ ,గుండోజ్ నవీన్ చారి, మంగలి కార్తీక్ ,జోగిరి రాజయ్య, పుప్పాల మహేష్ ,ప్యాగ మహేష్, లక్ష్మణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.