
జూనియర్ కళాశాల అధ్యాపక బృందం
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య కోసము ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్ అవ్వడానికి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి, కరపత్రాలతో ఇంటింటా విస్తృత ప్రచారం ప్రచారం చేసినారు.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ మాట్లాడుతూ మా కళాశాలలో ఇంట ర్మీడియట్ కోర్సులు ఎంపీసీ ,బై పిసి ఎంఈసి, సిఇసి ,హెచ్ఇసి, ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగుమీడియం ఉన్నాయి. మా కళాశాలలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నర్సింగ్, ఉన్నత చదువుల్లో ఉత్తీర్ణత సాధించడమే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అదేవిధంగా విద్యార్థి జైన్ అయిన వెంటనే వేల రూపాయల తెలుగు అకాడమీ పుస్తకాలు ఇవ్వబడునని అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ సౌకర్యం ఉంటుందని, కెరియర్ గైడెన్స్, ప్రతి వారం విద్యార్థులకు ఆటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందము హిమబిందు, సునీల్ , శైలేందర్, వేణు, కల్పన, మల్లికార్జున్ , డాక్టర్ రవీంద్ర నాయక్, శ్రీనివాస్ సౌజన్య విద్యార్థులు పాల్గొన్నారు.