Widespread Congress Campaign in Ward 14
14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థుల విస్తృత ప్రచారం
ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపే
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ సోమవారం విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు ఇంటింటా తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ఓటును అభ్యర్థించారు.ఈ సందర్బంగా అభ్యర్థి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,యువ నాయకులు పాల్గొన్నారు.
