Police Inspect Black Spots to Prevent Road Accidents
ప్రమాదాల నివారణకు కసరత్తు..ప్రమాద స్థలాల గుర్తింపు
సిపి అంబర్ కిషోర్ జూ
మంచిర్యాల,నేటి ధాత్రి:
రాజీవ్ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాల వలన ప్రజల ప్రాణల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణకు చర్యలకు డిజిపి చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమం లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్ఆర్కె సంస్థ అధికారులతో కలిసి గోదావరిఖని బి – గెస్ట్ హౌస్ మూల మలుపు వద్ద, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్ ను సందర్శించారు.ఈ సందర్బంగా మూలమలుపు వద్ద ఏర్పాటు చేస్తున్నా ఐలాండ్ ల ఏర్పాటు డిజైన్,గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు,ప్రమాదాల నివారణ చర్యలు,రేడియం బ్లింకర్స్,స్టడ్స్,సిసి కెమెరాల ఏర్పాటు,ప్రమాద స్థలాల గుర్తింపు,తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు.రోడ్డు సేఫ్టీ కమిటీ లు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్ర స్థాయిలో బ్లాక్ స్పాట్ లను సందర్శించి,కారణాలపై సమీక్షా జరిపి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.సీపీ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని,కుటుంబాలు దెబ్బతింటున్నాయని,ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు.మద్యం సేవించి వాహనం నడపడం,రాంగ్‌సైడ్ డ్రైవింగ్,సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు.ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి,ప్రతి వ్యక్తికి చేరవేసి, ప్రమాదరహిత రామగుండం కమీషనరేట్ గా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని సీపీ స్పష్టం చేశారు.అరైవ్ అలైవ్ ద్వారా విద్యార్థుల్లో,యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా,ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు.ఈ కార్యక్రమం లో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి,రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు,రోడ్ సేఫ్టీ టీమ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ,ఎస్ఐ లు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
