Excise Dept Cracks Down on Illicit Liquor
గుడుంబా తయారీపై ఉక్కు పాదం మోపిన ఎక్సైజ్ శాఖ
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్ మండలంలో గుడుంబా నిర్మూలన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా, అంజన్ రావు, ప్రోహిబిషన్ ఎక్సజ్ డిప్యూటీ కమీషనర్, వరంగల్ డివిజన్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ ఎక్సజ్ ఆఫీసర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదేశాల మేరకు ప్రోహిబిషన్ ఎక్సస్ స్టేషన్ భూపాలపల్లి ప్రోహిబిషన్ ఎక్సస్ స్టేషన్-కాటారం, సంయుక్తగా భూపాలపల్లి మండలంలోని గొల్లభూద్దరం, గ్రామంలో నాటు సారాయి తయారీ స్థావారాలపై దాడులు నిర్వహించి (03) కేసులు నమోదు చేసి,( 02) మంది నిందితులను అరెస్ట్, (30 )లీటర్ల నాటుసాయిరా (08) కేజీల చక్కర ను స్వాధీన పరుచుకొని (900)లీటర్ల చక్కర పానకాంను ధ్వంసం చేయడం జరిగింది. తదుపరి నాటుసారాయి వల్ల ప్రజలకు జరుగు నష్టం గురించి, ఒక అవగాహన కార్యక్రమం చేపట్టటం జరిగింది. తదుపరి ఎవరైనా నాటు సారాయిని, తయారు చేసిన, రవాణా చేసిన, కలిగి ఉన్న అమ్మిన చట్ట రీత్యా చర్యలు వుంటాయని సీఐ రమ్య తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాటారం సిఐ కిష్టయ్య బాదావత్
భూపాలపల్లి భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై షేక్ రబ్బాని సిబ్బంది పాల్గొన్నారు
