నర్సంపేట,నేటిధాత్రి:
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నూతన సంహాత్సరం 2025-26 క్యాలెండర్ ను స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ నరేష్ రెడ్డి శనివారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు సంంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ శ్రావని,మోకుదెబ్బ స్టేట్ వర్కింంగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సొల్తీ సారయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్, చీకటి చిరంజీవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.