“నేటిధాత్రి” కోలాపూర్. మహారాష్ట్ర పోలీసు వార్షికోత్సవ “రైజింగ్ డే” సందర్భంగా, గణేశోత్సవాలు, నవరాత్రి, ఇతర పండుగలు మరియు ప్రయాణాల సమయంలో ఊరేగింపుల రద్దీ సమయంలో వివిధ ప్రదేశాలలో చోరీకి గురైన వివిధ కంపెనీలకు చెందిన రూ. 7,00,000/- విలువైన మొత్తం 40 ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాండ్సెట్లను జూనా రాజ్వాడ పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొబైల్లను వాటి అసలు యజమానులకు ఈరోజు తిరిగి ఇచ్చింది.
ఈ కార్యక్రమంలోస్పెషల్ ఐజిపి కోలాపూర్ రేంజ్ సునీల్ జి పులారి ఐపిఎస్,సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కోలాపూర్ డిస్టిక్ యోగేష్ జి కుమార్ గుప్తా ఐపిఎస్, రాజువాడ పోలీస్ ఇన్స్పెక్టర్ కిరణ్ జి లోన్దే పాల్గొన్నారు
