ప్రభుత్వ స్కూల్లో ఎస్ ఏ 2 పరీక్షల నిర్వహణ తీరు పరిశీలన.

ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ భద్రయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో నీ ప్రభుత్వ పాఠశాలలో జరుగుచున్న ఎస్ఏ 2 పరీక్షల పనితీరును సోమవారం రోజున ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ శనిగరపు భద్రయ్య పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విద్యార్థులు లక్ష్యం నిర్ణయించుకొని ప్రణాళిక బద్ధంగా చదివితే ఉన్నత స్థానాలను చేరుకొని తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను నిలుపుతారని అన్నారు,
మండలం లోని కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించి విద్యార్థులు వేసవి సెలవులను మంచి అవకాశంగా భావించి సెలవులను వృధా చేయకుండా తర్వాత తరగతి టెక్స్ట్ బుక్స్ ను ఉపయోగించుకొని చదవాలని. రాత ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులు లక్ష్యం నిర్ణయించుకుని దానిని చేరడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సమాజంలో పేరు ప్రతిష్టలు గడించాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా పరీక్షలు పూర్తి అవుతున్నందున జవాబు పత్రములను మూల్యాంకనము చేసి ఐ ఎస్ ఎం ఎస్ పోర్టల్ నందు మార్కులను నమోదు చేయాలని అటు పిదప విద్యార్థుల ప్రగతి పత్రంలను ప్రింట్ తీసి తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు 23/04/2024నాడు అందజేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మొగుళ్లపల్లీ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ మొగుళ్ళపల్లి నందు ఎస్ ఎ 2 పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి ఏర్పాట్ల విషయంలో ప్రధానోపాధ్యాయులు విజయ పాల్ రెడ్డి తగు శ్రద్ధ తీసుకున్నందుకు సంతృప్తి .అభినందనలు వ్యక్తం చేశారు.
వీరితో జడ్పీహెచ్ఎస్ మొగుళ్ళ
పెల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు విజయపాల్ రెడ్డి. కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ సుమలత. కోఆర్డినేటర్ చంద్రlమౌళి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!